గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మోహన్ బాబు, మంచు విష్ణుపై భారీ ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా విడుదల ముందు నుంచే ఈ దుమారం ప్రారంభం అయింది. కొన్ని థియేటర్లలో కేవలం రెండు టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయంటూ..ఒకటి కాదు..రకరకాలుగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ నడిపారు. ఇదే అంశంపై మోహన్ బాబు కుటుంబానికి చెందిన ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ ల తరపున శేషు కెఎంఆర్ తాజాగా ఫిర్యాదు చేశారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ పాంలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లకు ఇదే అంశంపై ఆయన ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయా వ్యక్తులు పెట్టిన అనుచిత పోస్టులు తొలగించాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా వెనకాడబోమని పేర్కొన్నారు.
డాక్టర్ మోహన్ బాబు మాజీ రాజ్యసభ సభ్యుడే కాకుండా..నటుడు, నిర్మాత, విద్యావేత్తగా ఉన్నారని..ఆయనపై అవమానకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఫిర్యాదు దీనికి సంబంధించిన లింక్ లు కూడా జత చేశారు. మోహన్ బాబుతోపాటు ఆయన తనయుడు, హీరో, విద్యావేత్త అయిన మంచు విష్ణుపై కూడా ఇలాంటి అనుచిత విమర్శలే సాగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియా సంస్థలు తగు చర్యలు తీసుకోకపోతే పది కోట్ల రూపాయల డ్యామేజ్ సూట్ వేస్తామన్నారు. ఏపీ, తెలంగాణలో సినిమా టిక్కెట్ల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఆరోపించా