భారీ అంచనాల మధ్య బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సత్తా చాటింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా వంద కోట్ల రూపాయలు వచ్చాయి. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా టాక్సిక్ మూవీ అన్నీ కలుపుకుని 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా వెల్లడించింది. గత సినిమా లు అంటే హీరో యష్ నటించిన కేజీఎఫ్ రెండు భాగాలతో ప్రేక్షకులు టాక్సిక్ విషయంలో కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాస్తవానికి టీజర్ ...ట్రైలర్ తర్వాత ఈ మూవీ పై అనుమానాలు వ్యక్తం అయినా కూడా హీరో యష్ కథ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఉంటాడులే అనుకున్నారు అంతా. కానీ ప్రేక్షకుల అనుమానాలే నిజం అయ్యాయి. టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు ఈ సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టాక్సిక్ మూవీ విషయంలో ఏ మాత్రం కథ, కథనం పై దృష్టి పెట్టకుండా ఈ సినిమాను తెరకెక్కించటంతో అంతా గందరగోళంగా మారింది. ఆ ప్రభావం సినిమా పై పడింది.

                              Full View     భారీ అంచనాల మధ్య టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే ఉన్నా కూడా...నెక్స్ట్ డే నుంచే అంటే గురువారం నుంచే ఈ సినిమా బుకింగ్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. టాక్సిక్ మూవీ కి రివ్యూస్ విషయంలో కూడా పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ కానీ..ఇతర ఆసక్తికర అంశాలు కూడా ఏమి లేకపోవటమే. ఇందులో ఉన్న మితిమీరిన హింస, శృంగారం కూడా సినిమాకు మైనస్ గా మారాయి. యష్ కు జోడిగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తే ..ఇందులో నయనతార హీరో యష్ అక్కగా కనిపిస్తారు. వీళ్ళతో పాటు రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి లు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.

Tags: