Full Viewరెండు నెలలు. కేవలం రెండు నెలల్లోనే ఆరు సినిమాలు సూపర్ హిట్ అవటంతో టాలీవుడ్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు. ఇందులో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉంటడం మరో విశేషం సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు మంచి ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది. బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి హిట్ కొట్టింది. ఆయా సినిమాలు అమ్మిన రేట్లు..వచ్చిన కలెక్షన్ల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. వీరసింహారెడ్డి తో పోలిస్తే వాల్తేర్ వీరయ్య వసూళ్ల పరంగా దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ రెండు సంక్రాంతి సినిమాలతో పాటు విజయ్ వారసుడు, సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ డబల్ బ్లాక్ బస్టర్ హిట్ గా చెపుతున్నారు. ధనుష్ నటించిన సార్ కూడా డబల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విషుకథ హిట్ జాబితాలో నిలిచాయి.
సార్ , వినరో భాగ్యం విష్ణుకథ ఇంకా వసూళ్లు సాగిస్తున్నాయి. వారసుడు, సార్ సినిమాల్లో నటించింది ఇద్దరు తమిళ్ హీరోలు అయితే...ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది తెలుగు దర్శకులు వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఇంకా మిగిలిన పది నెలల్లో పెద్ద సినిమాలు ఎన్నో క్యూలో ఉన్నాయి. నాని దసరా పాన్ ఇండియా సినిమాగా ఈ మార్చి 30 న విడుదల కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు, రవి తేజ నటించిన రావణాసుర, చిరంజీవి భోళా శంకర్, మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా, ప్రశాంత్ నీల్ సాలార్ సినిమాలు కూడా ఈ సంవత్సరం లోనే రాబోతున్నాయి.