టాప్ హీరోయిన్లను దాటేసి దూసుకెళ్తున్న శ్రీలీల

Update: 2023-05-06 08:52 GMT

టాలీవుడ్ లో ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ ట్రెండ్ కొనసాగుతుంది. విజయాల వెంట పడటం టాలీవుడ్ కు కొత్తేమి కాదు. అది జానర్ అయినా ..హీరోయిన్ అయినా. సక్సెస్ వస్తే అందరూ వాళ్ళ వెంట పడతారు...ఎక్కడైనా లెక్క తేడా వస్తే మాత్రం మళ్ళీ అటు వైపు చూడరు. హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది అనే చెప్పాలి. పెళ్లి సందడితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు ఏ హీరోయిన్ అందుకోలేని రేంజ్ లో దూసుకు పోతోంది. టాప్ హీరో ల దగ్గర నుంచి ప్రతి కీలక సినిమాలో ఇప్పుడు ఆమె భాగస్వామ్యం కనిపిస్తోంది. ఇది అంతా చూస్తున్న వారు ఇప్పుడు శ్రీలీల ను టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా పిలుస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న సినిమాల్లో కొన్ని హిట్ అయినా కూడా శ్రీలీల హవా టాలీవుడ్ లో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది అని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. ప్రధానంగా రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ కావటం..ఇందులో శ్రీలీల యాక్షన్, స్పీడ్ చాలా మందిని ఆకట్టుకుంది.

                                                  Full Viewఅప్పటినుంచే ఆమెకు వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పది వరకు సినిమాలు ఉన్నాయంటే ఆమె హవా ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒక్క శ్రీలీలకు తప్ప ఈ రేంజ్ సినిమాలు మరో హీరోయిన్ ఎవరికీ లేవు అనటం అతిశయోక్తి కాదేమో. విజయదేవరకొండ 12 వ సినిమా లో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేయనుంది. తాజాగా ఆమె ఈ సినిమా పూజ కార్యక్రమంలో కూడా పాల్గొంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలకృష్ణ సినిమా ఎన్ బికె 108 లో, మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా ఎస్ఎస్ఎంబి 28 లో, నితిన్ సినిమాలో, వైష్ణవ తేజ్ సినిమా, రామ్, నవీన్ పోలిశెట్టి మూవీ లతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓకే చేసింది శ్రీ లీల.

Tags:    

Similar News