వరదలతో గతంలో ఎప్పుడూలేని రీతిలో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు తమకు తోచినంత సాయం ప్రకటిస్తున్నారు. అందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించగా, మహేష్ బాబు కూడా కోటి విరాళం ప్రకటించారు.
హీరో రామ్ 25 లక్షల రూపాయల విరాళం అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లు 5 లక్షలు ప్రకటించారు.