సినిమా పరిశ్రమకు మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కరోనా ప్రభావం తొలి దశ కంటే ఇఫ్పుడు మరింత పెరగటంతో షూటింగ్ లు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. అంతే కాదు..పరిశ్రమ కూడా స్వీయ నియంత్రణ పెట్టుకుంది. అత్యవసరం అయితే తప్ప..షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ పనులు కూడా 50 శాతం సిబ్బందితోనే చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు తెలుగు చలనచిత్ర మండలి నిర్ణయాన్ని ప్రకటించింది. సినీ పరిశ్రమ మనుగడ, పరిశ్రమలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మంగళవారం నుంచే రాత్రి పూట కర్ఫ్యూను ప్రకటించిన విషయం తెలిసిందే.