సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్ దీన్ని 35 కోట్ల రూపాయల రికార్డు ధర కోట్ చేసి దక్కించుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. ఒక యువ హీరో సినిమా కు ఈ ధర పలకటమే ఇప్పుడు చర్చనీయాంశగా మారింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎన్ని రికార్డు లు క్రియేట్ చేస్తుందో చూడాలి. డీ జె టిల్లు సూపర్ సక్సెస్ తో టిల్లు స్క్వేర్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి.