రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

Update: 2024-07-29 12:59 GMT

చాలా కాలం తర్వాత మళ్ళీ పాత ప్రభాస్ కనిపించాడు. కేవలం 45 సెకన్ల గ్లింప్స్ తోనే రాజాసాబ్ లో ఈ పాన్ ఇండియా హీరో ఎలా సందడి చేయబోతున్నాడో దర్శకుడు మారుతీ ఒక శాంపిల్ చూపించాడు. బైక్ పై వచ్చి అద్దం లో తనకు తాను పూలతో దిష్టి తీసుకునే ఈ గ్లింప్స్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ గ్లింప్స్ లోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్..రొమాంటిక్, కామెడీ మూవీ గా ఇది తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.

                                                           Full Viewప్రభాస్ తాజా సినిమా కల్కి 2898 ఎడి ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్ తో రాజాసాబ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంటుంది అనే ధీమాతో ఆయన ఫాన్స్ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ మళ్ళీ ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడే డార్లింగ్ లుక్ లో ఉండటమే అనే లాజిక్ ను కూడా తెరమీదకు తెస్తున్నారు. దీనికి తోడు దర్శకుడు మారుతీకి కామెడీ జోనర్ పై ఉండే గ్రిప్ కూడా ఈ అంచనాలకు కారణం అవుతోంది.

Tags:    

Similar News