నాని ప్యారడైజ్ మూవీ మ్యానియా మొదలైంది. ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ కాగా ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ప్యారడైజ్ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం సెన్సార్ బోర్డు నాని ప్యారడైజ్ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ నిడివి రెండు గంటల 54 నిమిషాలపైనే ఉంది. గత కొంత కాలంగా హీరో నాని మాస్ పాత్రలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాడు. దసరా తో పాటు సరిపోదా శనివారం మూవీ లు మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దసరా కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తం గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

                                  ఇందులో నానికి జోడిగా కయాదు లోహర్ నటించింది. ఈ మూవీ లో వయలెన్స్ ఉన్నా కూడా అదే సమయంలో తల్లీ, కొడుకుల సెంటి మెంట్ కూడా సినిమాకు ప్రధాన బలం అని నాని ఇటీవల పలు మార్లు వెల్లడించారు. ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు కనిపించనున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. ఎప్పటి లాగానే తెలంగాణ లో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి మంజూరు అయింది.

Full View

Tags: