సిద్దూ ట్రాక్ లోకి వచ్చినట్లేనా?!(Telusukadha Movie Review)

Update: 2025-10-17 09:58 GMT

ఈ దీపావళికి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఇందులో మూడు ఇప్పటికే విడుదల కాగా..మరో సినిమా కె ర్యాంప్ శనివారం నాడు విడుదల కానుంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో అందరిని దృష్టిని ఎక్కువ ఆకర్షించిన మూవీ అంటే సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన తెలుసుకదా అనే చెప్పాలి. నీరజ్ కోనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై మిగిలిన వాటితో పోలిస్తే ఒకింత బజ్ ఎక్కువే ఉంది . మరో వైపు హీరో సిద్దు జొన్నగడ్డ విషయానికి వస్తే వరసగా రెండు సినిమాలు సూపర్ హిట్ వచ్చిన తర్వాత జాక్ తో బ్రేక్ పడింది. దీంతో ఈ యువ హీరో కు కూడా తెలుసుకదా ఫలితం ఎంతో కీలకంగా మారింది అనే చెప్పాలి. ఈ మూవీ శుక్రవారం నాడు ప్రపంచ వ్వాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

                                            ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఈ విషయం చెప్పేస్తారు. అయితే ఇది ఎవరితో...ఎలా అన్నది హీరో మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత బయటపెడతారు. అనాథ అయిన హీరో కి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కంప్లీట్ ఫ్యామిలీ తో జీవితం గడపాలనే కోరిక బలంగా ఉంటుంది. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినా...ఆ వెంటనే మరో అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాడు హీరో. కానీ ఒక రోజు వీళ్లకు పిల్లలు పుట్టరు అని తేలుతుంది. మరి ఈ సమస్యను పరిష్కరించేందుకు హీరో మొదటి లవర్ సిద్దు ఫ్యామిలీ ఎలాంటి సహకారం అందిస్తుంది...తర్వాత సిద్దు మొదటి లవర్ విషయం తెలిసిన తర్వాత వచ్చిన సమస్యలు ఎలా పరిష్కారం అయ్యాయి అన్నదే ఈ మూవీ.

                                            తెలుసుకదా మూవీ లో సిద్దు జొన్నలగడ్డ డైలాగు డెలివరీ స్టైల్ ఆయన పాత టిల్లు సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథలో భాగంగా వచ్చే ఈ డైలాగులతో ..ఎమోషనల్ సీన్స్ లో సిద్దు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇద్దరూ హీరోయిన్స్ ఉన్నా ఇవి రొటీన్ రోల్స్ గానే మిగిలిపోతాయి తప్ప...ఎవరికీ బలమైన పాత్ర ఉండదు అనే చెప్పొచ్చు. ఒక వైపు ముక్కోణపు ప్రేమ కథ తో పాటు ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి అనే అంశంపై సిద్దు తీసుకునే క్లాస్ లు యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. సిద్దు, సిద్దు ఫ్రెండ్ గా నటించిన వైవా హర్షల మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. ఈ సినిమా కు థమన్ మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. మొత్తం కథలో ఒక్కటే కొత్త పాయింట్ ను పెట్టుకుని దర్శకురాలు నీరజ కోన సినిమాను బాగానే నెట్టుకొచ్చారు.

                                                                                                                                                                                     రేటింగ్ :2 .5 /5

Tags:    

Similar News