రెండు వారాలు. ఐదు షోలు. తెలంగాణ సర్కారు భీమ్లానాయక్ కు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దిల్ రాజు కోరిక మేరకు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై బారీ అంచనాలు ఉండటమే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్సింగ్ లోనూ దుమ్మురేపుతోంది. బీమ్లానాయక్ తొలి రోజు అన్ని షోలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయాయి.
అదిరిపోయే ఓపెనింగ్స్ పవన్ ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. తమ హీరో సినిమా కొత్త రికార్డులు నెలకొల్పటం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో సినిమా టిక్కెట్ ధరల ఖరారు జీవో ఈ నెలాఖరుకు మాత్రమే విడుదల అవుతుందని సమాచారం. భీమ్లానాయక్ సినిమా ఉన్న కారణంగానే ఏపీ సర్కారు జాప్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. సినిమా టిక్కెట్ ధరల విషయంలో గతంలో పవన్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.