భోళాశంక‌ర్ హీరోయిన్ గా త‌మ‌న్నా

Update: 2021-11-09 10:26 GMT

చిరంజీవితో త‌మ‌న్నా మ‌ళ్లీ జోడీ క‌ట్ట‌నుంది. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న భోళా శంక‌ర్ సినిమాలోకి త‌మ‌న్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నాడు ఆధికారికంగా ప్ర‌క‌టించింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తంలో సైరా సినిమాలోనూ త‌మ‌న్నా చిరంజీవితో క‌ల‌సి న‌టించింది.

ఇప్పుడు ఇది రెండ‌వ చిత్రం. భోళా శంక‌ర్ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ఈ నెల 11న జ‌ర‌గ‌నున్నాయి. ఆ వెంట‌నే న‌వంబ‌ర్ 15 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఇదే సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించ‌నుంది. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళం సినిమాకు ఇది రీమేక్ గా తెర‌కెక్కుతోంది. ఏ కె ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Tags:    

Similar News