ఇంటికి చేరుకున్న ఆనందంలో తమన్నా

Update: 2020-10-15 15:03 GMT

తమన్నా కరోనా నుంచి కోలుకుని ఇప్పుడు ఎంతో ఆనందంలో ఉన్నారు. మరింత విశ్రాంతి కోసం ఆమె హైదరాబాద్ నుంచి ముంబయ్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తమన్నా ఇంటికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులు రజని, సంతోష్‌ భాటియా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. పెంపుడు కుక్క పెబెల్స్‌ సైతం తమన్నాను చూడగానే సంతోషంతో గంతులు వేసింది. క్వారంటైన్‌ అనుభవం గురించి తమన్నా మాట్లాడుతూ.. ''క్రేజీగా అనిపించింది.

ఇదంతా ముగిసిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జీవితం నేను జీవించవచ్చు. త్వరలోనే అన్ని విషయాలను మీతో పంచుకుంటాను''అని చెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటానని, కరోనా కారణంగా కోల్పోయిన శక్తినంతటినీ తిరిగి పొందేందుకు, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటానని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా షూట్‌కు వెళ్తానని చెప్పారు.

Tags:    

Similar News