తమన్నా కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వచ్చిందనే కనికరం కూడా లేకుండా లావు అయ్యానని కొంత మంది సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయటంపై అవాక్కు అయింది. విమర్శలను ఎంతో కసిగా తీసుకున్న తమన్నా రెండు నెలల పాటు స్థిరంగా..నిపుణుల పర్యవేక్షణలో వర్కవుట్ చేయటం ద్వారా కరోనాకు ముందు ఉన్న బాడీ షేప్ సాధించినట్లు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వర్కవుట్లకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసుకుంది. ఇప్పటికే తమన్నా పలు సినిమాలతో బిజీబిజీగా ఉంది.