స‌ర్కారువారి పాట ఓటీటీలోనూ 'వేలంపాట'

Update: 2022-06-02 10:25 GMT

Full Viewఒక‌రు మొద‌లుపెడితే అంద‌రిదీ అదే దారి. అస‌లు తీసుకునే నిర్ణ‌యం వెన‌క ఏమైనా లాజిక్ ఉందా? లేదా అన్న విష‌యం ఎవ‌రికీ అవ‌స‌రం లేదు. ప్రేక్షకుడి ద‌గ్గ‌ర నుంచి అందినంత దండుకోవ‌ట‌మే వారి ప‌ని. ఇప్పుడు స‌ర్కారువారి పాట మూవీ చిత్ర యూనిట్ కూడా అదే ప‌నిచేస్తోంది. కెజీఎఫ్ 2 బాట‌లో ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉండ‌గా..ఈ సినిమా చూడ‌టానికి ఏకంగా 199 రూపాయ‌లు చెల్లించాలంట‌. అది కూడా డ‌బ్బు చెల్లించిన 48 గంట‌ల్లో చూసేయాల‌నే నిబంధ‌న కూడా పెట్టారు. అంటే ఈ గ‌డువు దాటితో మ‌రోసారి డ‌బ్బులు చెల్లించాల‌న్న‌మాట‌.

ప‌ర‌శ్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీపై మిక్స్ డ్ ఓపీనియ‌న్ వ్య‌క్తం అయింది. ఫ‌స్టాఫ్ స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతే..సెకండాఫ్ ను మాత్రం సాగ‌దీశార‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. ఓ వైపు థియేట్రిక‌ల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అంత ధ‌ర నిర్ణ‌యించ‌టం సినీ అభిమానుల‌కు ఏ మాత్రం రుచించ‌టం లేదు. ఇలాంటి నిర్ణ‌యాలు అ న్నీ ముందు ముందు సినిమా ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అవకాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Tags:    

Similar News