వాడు ఇచ్చిన 150 రూపాయ‌ల‌కు 1500 న‌వ్వించాం చాలు

Update: 2022-02-17 04:13 GMT

డీ జె టిల్లు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

సూర్య‌దేవ‌ర నాగవంశీ. టాలీవుడ్ లోని భారీ చిత్రాల నిర్మాత‌ల్లో ఒక‌రు. ఇటీవ‌ల విడుద‌లైన డీజే టిల్లు నిర్మాత కూడా ఆయ‌నే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఆక‌ట్టుకుంటోంది. సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నిర్మాత నాగ‌వంశీతోపాటు హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ నేహ శెట్టి ప‌లు చోట్ల ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ చోట నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నిర్మాత నాగ‌వంశీ ప్రేక్షకుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. మీడియా అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఈ లెక్క‌లు.. అన్నీ మ‌న‌లాంటి మేథావులకు కావాలి కానీ..ఆడియెన్స్ కు అక్క‌ర్లేదు. వాడు ఇచ్చిన 150 రూపాయ‌ల‌కు వాడు న‌వ్వుకున్నాడా లేదా అన్న‌ది స‌రిపోతుంది.

వాడు ఇచ్చిన 150 రూపాయ‌ల‌కు 1500 న‌వ్వించాం చాలు. వాడు హ్యాపీ అంటూ స్పందించారు. పోనీ ఇదే బ్యాన‌ర్ పై తీసిన ఏదైనా ఫ‌ట్ అంటే మరి అప్పుడు ఏమి చేస్తాడు. డ‌బ్బులు తిరిగి ఇస్తారా? సినిమా అన్న త‌ర్వాత కొన్ని హిట్ అవుతాయి..కొన్ని ఫ‌ట్ మంటాయి. ఇది స‌హ‌జం. కానీ మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకుల‌పై వంశీ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ నిర్మాత‌లే తెర‌కెక్కించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానాలు న‌టించిన బీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ ఏడాది చాలా సినిమాలు ఉన్నందున డీజే టిల్లు సెకండ్ పార్ట్ ను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తామ‌న్నారు. నాగ‌వంశీ ఆయ‌నకు ఆయ‌న మేధావి అని సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇచ్చుకోవ‌ట‌మే కాదు.. ప్రేక్షకుల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిట‌నే విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి.ఈ వ్యాఖ్య‌ల వీడియోను కూడా ఇందులో చూడొచ్చు.Full View

Tags:    

Similar News