Full Viewటాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగువెలిగిన శ్రీలీలకు ఈ మధ్య కొత్త సినిమాల్లో ఛాన్సులు పెద్దగా రావటం లేదు. మరో వైపు శ్రీలీల చేసిన సినిమాలు ఎక్కువ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాలను చవిచూడటం కూడా ఆమెపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఆమె కు ఒక భారీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కింది. గత కొన్ని రోజులుగా ఈ విషయం పరిశ్రమ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పుడు ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే జైలర్ 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న ధర్మన్ సినిమాలో శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది.
ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియో తో ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుంటే..ఇందులో ఇతర కీలక పాత్రల్లో రాశిఖన్నా, రామ్ పోతినేని, యోగి బాబు నటిస్తున్నారు. ఈ మూవీ లో రజనీకాంత్ కు జోడిగా నయనతార నటిస్తోంది. ప్రముఖ నటుడు కమలహాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.