ర‌వితేజ‌కు జోడీగా శ్రీలీల‌

Update: 2022-02-14 09:11 GMT

పెళ్లిసంద‌డి సినిమా ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్న హీరోయిన్ శ్రీలీల‌. ఇప్పుడు ఈ భామ ర‌వితేజ‌కు జోడీ క‌డుతోంది. ధ‌మాకా సినిమాలో శ్రీలీల ప్ర‌ణ‌విగా సంద‌డి చేయ‌నుంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా న్యూలుక్ విడుద‌ల చేసి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్, పీపుల్స్ ఫ్యాక్ట‌రీ త‌ర‌పున టి జి విశ్వ‌ప్ర‌సాద్ లు నిర్మిస్తున్నారు. పెళ్లి సంద‌డి త‌ర్వాత శ్రీలీల చేస్తున్న రెండ‌వ చిత్రం ఇదే. 

Tags:    

Similar News