Full Viewహీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా శ్రీదేవి సొడా సెంటర్. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ సోడాల శ్రీదేవి పాత్రకు సంబంధించిన పరిచయ వీడియోను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఇందులో ఆనంది హావభావాలు, డైలాగ్ డెలివరి ఆకట్టుకునేలా ఉన్నాయి.
హీరో సుధీర్ బాబుకు ఓ సోడా ఇచ్చి తన వైపు ఓర చూపులు చూస్తుంటే గోలీ గొంతులో దిగుతుంది జాగ్రత్త అంటూ చెప్పే డైలాగ్ ఇందులో హైలెట్ గా నిలిచింది. ఓ జాతరలో శ్రీదేవి..సోడా శ్రీదేవి ఇక్కడ అంటూ ఓ యువకుడిని కొట్టే సన్నివేశాలతో ఆమె పాత్రను పరిచయం చేశారు.