తమన్నాతో సితార సందడి

Update: 2021-03-17 15:03 GMT

సితార. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె. సెలబ్రిటీలు వచ్చారంటే చాలు..వాళ్లతో కలసి ఫోటోలు దిగటం ఆమెకు మహా సరదా. అంతే కాదు..ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార తమన్నాను కలసింది. తాజాగా మహేష్ బాబుతో కలసి తమన్నా ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంది.

ఆ సమయంలోనే ఈ ఫోటో దిగి నేను ఎవరిని కలిశానో చూడండి అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది. తమన్నా కూడా అంతే సరదాగా సితార ఫోటోపై స్పందించింది. 'సీతు పాప నువ్వు ఇంత తొందరగా ఎదగకు(పెరగకు) ప్లీజ్‌' అంటూ ముద్దులతో ఉన్న ఎమోజీలను జత చేసింది.

Tags:    

Similar News