కలిసి వచ్చిన బ్యానర్ లోనే మరో సినిమా

Update: 2025-07-09 10:24 GMT

సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. టిల్లు సిరీస్ హిట్స్ తర్వాత ఈ హీరో చేసిన జాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తన ఇమేజ్ మార్చుకునేందుకు అని చేసిన జాక్ ప్రయత్నం ఫెయిల్ అయింది. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తనకు కలిసి వచ్చిన బ్యానర్ లో మరో కొత్త సినిమా కు ఈ హీరో రెడీ అయ్యాడు. ‘ మీరు ఇప్పటివరకు హీరో లను చూశారు. విలన్ల ను చూశారు. కానీ ఇది మాత్రం మీరు పెట్టే లేబుల్స్ కు ఏ మాత్రం సెట్ అయ్యేది కాదు.

                                 ఈ సారి ఏ మాత్రం దయ ఉండదు. థియేటర్స్ స్క్రీన్స్ మీద ఇక ఫైర్ తప్పదు’ అంటూ కొత్త సినిమా ప్రకటన సమయంలోనే భారీ ఎలివేషన్ ఇచ్చింది సితార ఎంటర్ టైన్మెంట్స్. సిద్దు హీరో గా బడాస్ అనే కొత్త సినిమా ప్రకటించారు. రవికాంత్ పారేపు దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాను 2026 లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News