ఆక‌ట్టుకుంటున్న శ్యామ్ సింగ‌రాయ్ ట్రైల‌ర్

Update: 2021-12-14 14:32 GMT

Full Viewనాని, సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ లు న‌టించిన సినిమా శ్యామ్ సింగ‌రాయ్. ఈ సినిమా ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైల‌ర్ లో నాని రెండు షేడ్స్ లో అద్భుత న‌ట‌న క‌న‌ప‌ర్చాడు. చ‌లాకీ కుర్రాడి పాత్ర‌లో ఒక షేడ్...శ్యామ్ సింగ‌రాయ్ పాత్ర‌లో డిఫ‌రెంట్ షేడ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. డైలాగ్స్, స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింద‌నే చెప్పాలి.

మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌రంగల్ లో జ‌రిగింది. ఈ సినిమా డిసెంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మళ‌యాళ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదే నాని తొలి పాన్ ఇండియా సినిమాగాచెప్పొచ్చు . రాహుల్ సంకీర్త్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రొడ‌క్షన్ నిర్మించింది.

Tags:    

Similar News