Full View'అడిగే అండలేదు. కలబడే కండలేదు అని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు చీల్చుకుపుట్టి ..రాయటమే కాదు..కాలరాయటమూ కూడా తెలుసు అని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగరాయ్' అంటూ పవర్ ఫుల్ డైలాగులో విడుదలైంది ఈ సినిమా టీజర్. ఈ సినిమాలో హీరో నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు సందడి చేయనున్నారు. టీజర్ చూస్తే ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేసినట్లు కన్పిస్తోంది. చిత్ర యూనిట్ గురువారం ఉదయం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.
'స్త్రీ ఎవరికి దాసి కాదు. చివరకు దేవుడికి కూడా ఖబడ్డార్' అంటూ నాని చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. టీజర్ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రే క్షకుల ముందుకు రానుంది. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. హైదరాబాద్ లోని ఏఏంబీ మాల్ లో టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.