శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉంటారు. ఈ మధ్య ఆమె ముంబయ్ విమానాశ్రయంలో లోపలికి ఎంట్రీకి ఇస్తుంటే అక్కడ ఉండే ఫోటోగ్రాఫర్ శ్రద్ధా మేడమ్..మీరు చీరలో చాలా బాగుంటారు అంటూ..ఓ సారి చీరకట్టుకుని రండి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆమె దీనికి నవ్వుతూ..ఎయిర్ పోర్టుకు చీరకట్టుకుని రావాలా అంటూ స్పోర్టివ్ గా తీసుకుని వెళ్ళిపోయారు. ఫోటోగ్రాఫర్ కోరినట్లుగానే శ్రద్ధాదాస్ తాజాగా ముంబయ్ ఎయిర్ పోర్టకు వచ్చారు.
అంతే కాదు..ఫోటోగ్రాఫర్ కోరిక మేరకే ఇలా చీరలో వచ్చానంటూ కూడా స్పష్టం చేశారు. శ్రద్ధాదాస్ కామెంట్స్ కు ఫోటోగ్రాఫర్ కుషీకుషీగా తన కెమెరాకు పని చెప్పటంతో పాటు మీరు చీరలో సూపర్ గా ఉన్నారంటూ మరోసారి ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రద్ధాదాస్ ఇన్ స్టా రీల్స్ లో షేర్ చేశారు. ముంబయ్ పోర్టులోకి చీరతో వచ్చిన ఫోటో ఇదే.