నారీ నారీ నడుమ మురారి జనవరి 14 న

Update: 2026-01-11 14:54 GMT

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గత కొన్ని సంవత్సరాలుగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సంక్రాంతికి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ యువ హీరో మంచి ఫన్ డ్రామాతో కూడిన నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా వెరైటీ గా జనవరి 14 ఈవెనింగ్ షోస్ నుంచి విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ .

                                   Full Viewదర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ కూడా సంక్రాంతి రేస్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ట్రైలర్ మంచి ఫన్ తో ఎంటర్టైనింగ్ గా సాగింది. సత్య, నరేష్, వెన్నెల కిషోర్ ఇలా అందరితో సాలిడ్ కామెడీ ట్రాక్ లు సింగిల్ లైనర్స్ సినిమాలో హైలైట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Tags:    

Similar News