'సీటిమార్. గోపీచంద్, తమన్నాలు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా. ఈ సినిమాలో వీరిద్దరూ కబడ్డీ ఆట కోచ్ లు గా కన్పించబోతున్నారు. కబడ్డీ ఆట కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. 'గెలుపు సూరీడు చుట్టూ తిరిగే పొద్దుతిరుగుడు పువ్వా..మా పాపికొండల నడుమ రెండు జళ్ళేసిన చందమామ నువ్వా' అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.
గోదావరి ప్రకృతి అందాలతో పాటు అద్భుతంగా చిత్రీకరించారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన హిట్ లేక గత కొంత కాలంగా ఇబ్బందిపడుతున్న గోపీచంద్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. టైటిల్ సాంగ్ అయితే సినిమాపై హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.