'సీటిమార్' ఉమెన్స్ డే లుక్

Update: 2021-03-08 11:47 GMT

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు తమ తమ సినిమాలకు సంబంధించిన. కుటుంబాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అదే సమయంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'సీటిమార్' చిత్ర బృందం కూడా అదే పని చేసింది. పూర్తిగా మహిళా కబడ్డీ టీమ్ తో ఓ కొత్త లుక్ ను విడుదల చేసింది.

ఇందులో కబడ్డీ కోచ్ గా నటిస్తున్న తమన్నాతో పాటు టీమ్ సభ్యులను చూపించారు. మరో కోచ్ గా హీరో గోపీచంద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కు సంపత్ నంది దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ కు మంచి ఆదరణ లభించింది.

Tags:    

Similar News