దీపావళి సత్యదేవ్ సినిమా

Update: 2024-09-17 15:10 GMT


Full View

 సత్యదేవ్ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే జీబ్రా. సత్యదేవ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. ఈ సినిమా కు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ మూవీ ని దీపావళికి అంటే అక్టోబర్ 31 న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ తో పాటు డాలి ధనంజయ, సత్యరాజ్ , సత్య, సునీల్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

                                           ఇందులో హీరోయిన్లుగా జెన్నిఫర్, ప్రియా భవాని శంకర్ లు నటిస్తున్నారు. జీబ్రా సినిమా కు అదృష్టం ధైర్యవంతులకు అనుకూలంగా ఉంటుంది (luck Favours the Brave) అనే ట్యాగ్ లైన్ పెట్టారు.ఈ ఏడాదే సత్యదేవ్ కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2022 లో సత్యదేవ్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాధర్ సినిమాలో కీలక పాత్రను దక్కించుకుని తన నటనకు మంచి ప్రశంసలు పొందారు.

Tags:    

Similar News