Full Viewమహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. వాస్తవానికి ఇది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ చాలా ముందుగానే ఈ పాట ఆన్ లైన్ లో లీక్ కావటంతో చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన దానికంటే ముందుగానే పాటను అదికారికంగా విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకునేలా సాగింది.
'కళ్ళా అవి కళావతి..కల్లోల మైందే నా గతి. కురులా అవి కళావతి..కుళ్ళా బొడిచింది చాలుతీ.' అంటూ సరదా సరదాగా సాగిన ఈ ప్రేమ గీతం మంచి కలర్ ఫుల్ గా సాగింది. ఇందులో మహేష్ బాబు, కీర్తిసురేష్ లు ఇద్దరూ స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టారు. నంత్ శ్రీరామ్ ఈ పాటను రచించారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.