Full Viewసరా సరా సర్కారు వారి పాట..షురూ షురూ అన్నాడు అల్లూరి వారి బేటా అంటూ సాగే ఈ సినిమా టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ శనివారం ఉదయం విడుదల చేసింది. మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. వసూలు కానీ మొండిబాకీలు..బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అంశంపై ఈ సినిమా తెరకెక్కినట్లు పాటలోని అంశాలను చూస్తే అర్ధం అవుతోంది. ఈ సినిమా మే12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.