మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను మార్చి20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి పెన్నీ పేరుతో విడుదల కానున్న ఈ పాట ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈ సినిమా కూడా విడుదల తేదీల్లో పలుమార్లు మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.