మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. శివరాత్రిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ మహేష్ బాబు యాక్షన్ సన్నివేశంతో కూడిన న్యూలుక్ ను విడుదల చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా పలు సినిమాల తరహాలోనే ఇది కూడా వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.