లెక్కసరిపోయింది అంటున్న చిత్ర యూనిట్

Update: 2024-09-15 14:49 GMT

ఇప్పుడు సరిపోయింది. ఇది సరిపోయిందా శనివారం చిత్ర యూనిట్ నుంచి వచ్చిన స్పందన. దీని వెనక కథ ఏంటి అంటారా?. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆదివారం నాడు ఒక లుక్ ను విడుదల చేసింది. దీంతో నాని కెరీర్ లో వంద కోట్ల రూపాయలు సాధించిన రెండవ సినిమా గా సరిపోయిందా శనివారం నిలిచింది. నాని తొలి సారి దసరా తో బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల మార్క్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

                                                               అనుకున్నట్లుగానే సరిపోయిందా శనివారం సినిమా కూడా ఈ టార్గెట్ కు రీచ్ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమా లో నాని తో పాటు ఎస్ జె సూర్య పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. డీవీవీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని కి జోడిగా ప్రియాంక మోహన్ నటించింది. ఈ సినిమా వసూళ్లు వంద కోట్ల రూపాయలు చేరుకోవటంతో బాక్స్ ఆఫీస్ శివతాండవం...పోయారు...మొత్తం పోయారు అంటూ ఈ లుక్ విడుదల చేశారు.

Tags:    

Similar News