ఉత్తర అమెరికాలో నాని రికార్డు

Update: 2024-08-30 12:38 GMT

Full Viewభారీ అంచనాల మధ్య విడుదల అయిన నాని కొత్త సినిమా సరిపోదా శనివారం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. అయితే నాని దసరా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే ఈ సినిమా వసూళ్లు తక్కువే ఉన్నాయి. దసరా సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో నాని కి జోడిగా ప్రియాంక మోహన్ నటించగా...ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్నాడు.

                                    జేక్స్ బిజోయ్ అందించిన బాక్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. నార్త్ అమెరికాలో కూడా సరిపోదా శనివారం సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సరిపోదా శనివారం సినిమా 24 .11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడిస్తూ ఒక లుక్ విడుదల చేసింది.

Tags:    

Similar News