ఆయన అసలు ప్లాన్ ఏంటో!

Update: 2024-11-01 09:58 GMT

Full Viewఈ సారి సంక్రాంతి బరి అలాగే మారబోతుంది మరి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల ను ఇప్పటికే జనవరి 10 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల కూడా వాయిదా వేశారు. కానీ ఇప్పుడు వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే నిలిపారు. అంటే ఒక నిర్మాణ సంస్థకు చెందిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఆయా సినిమాల విడుదల తేదీ మధ్య గ్యాప్ ఉండొచ్చు కానీ...రెండు సినిమా లో సంక్రాంతి సెలవుల్లోనే రానున్నాయి.

                                          విచిత్రంగా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కలిసి నటించిన ఈ సినిమాకు టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. ఈ సారి నవ్వుల టపాసులు సంక్రాంతికి కూడా పేలుద్దాము అంటూ టైటిల్ లుక్ ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ ల కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా ఇది. ఇదిలా ఉంటే సంకాంత్రి బరిలో నందమూరి బాలకృష్ణ 109 కూడా నిలవనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని బాలకృష్ణకు ఎంతో కలిసి వచ్చిన సంక్రాంతి కే విడుదల చేసే ఉంది. నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటికే దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

Tags:    

Similar News