సంక్రాంతి సీజన్ లో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ పండగ రోజే విడుదల అయి..ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండటమే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తోలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని కీలక పాత్రధారులు అందరూ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటానికి తమ వంతు ప్రయత్నం చేసి విజయం సాధించారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ ఈ సినిమా తో మళ్ళీ హిట్ దక్కించుకున్నారు అనే చెప్పాలి. కనుమ రోజు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుకింగ్స్ ఫుల్ గా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా రికార్డు వసూళ్ల సాధించే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పరంగా వెంకటేష్ మూవీ నే ముందు వరసలో ఉంది అని చెప్పాలి.