నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన సినిమాలు అన్ని వరసగా హిట్స్ కావటమే. తాజాగా సంక్రాంతికి డాకుమహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 160 కోట్ల రూపాయల పైన గ్రాస్ వసూళ్లు సాధించింది. మరో వైపు బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రీను తో కలిసి అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో పెద్ద విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే. దీంతో ఇప్పుడు అఖండ 2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ 2 సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ శుక్రవారం నాడు కీలక అప్ డేట్ ఇచ్చింది.
అదేంటి అంటే అఖండ 2 లో బాలకృష్ణ కు జోడిగా సంయుక్త మీనన్ నటించనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అఖండ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే అఖండ 2 పూజ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్ కూడా పాల్గొన్నారు. దీంతో ఆమె తో పాటు ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అఖండ 2 సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.