'తొలిసారి మేమిద్దరం స్క్రీన్ పై కన్పించబోతున్నాం. అది కూడా చాట్ కోసం. ' అంటూ ఇన్ స్టా లో ఫోటో షేర్ చేసింది తమన్నా. ఆహా ఓటీటీ కోసం సమంత సెలబ్రిటీలతో కార్యక్రమం నిర్వహిస్తోంది. దాని పేరే శామ్ జామ్ అన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 11న ఆహాలో ప్రసారం కానుంది. ఇటీవలే తమన్నా కరోనా బారిన పడి కోలుకుంది.
కరోనా సమయంలో కొంత లావు కావటంతో పరిస్థితిని అర్ధం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కు దిగారని మండిపడింది కూడా ఈ మిల్కీ బ్యూటీ. ఇప్పుడు కరోనా భయాన్ని పక్కన పెట్టి అందరూ మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు.