స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-10-02 15:58 GMT

విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత స‌మంత త‌న ఇన్ స్టాగ్రామ్ డీపీలో పేర్కొన్న అంశాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇవి కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారు..ఇంత ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం వెన‌క కార‌ణం ఏమై ఉంటుందా అన్న చ‌ర్చ సాగుతోంది. ' నేను విచారంలో ఉన్న‌ప్పుడు మా అమ్మ చెప్పిన మాట‌లే గుర్తొస్తాయి.చ‌రిత్ర‌లో గెలిచింది ప్రేమ, నిజాయితీలే. నియంత‌లు, హంత‌కుల గెలుపు తాత్కాలిక‌మే. వారు నేల‌కొర‌గ‌క త‌ప్ప‌దు.ఇది ఎన్న‌టికీ గుర్తుపెట్టుకోవాలి' అంటూ పేర్కొన్నారు.

విడాకుల ప్ర‌క‌ట‌న‌లో అటు నాగ‌చైత‌న్య‌, ఇటు స‌మంత ఒకే ప్ర‌క‌ట‌న‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కానీ త‌ర్వాత స‌మంత ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం క‌ల‌క‌లంగా మారింది. ఇదిలా ఉంటే ...హీరో సిద్ధార్ధ కూడా సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. మోసం చేసిన వాళ్ళు ఎప్పుడూ బాగుప‌డ‌రు అంటూ పేర్కొన్నారు. ఇది ఎవ‌రిని ఉద్దేశించి అన్నాడు అన్న చ‌ర్చ ప్రారంభం అయింది. గ‌తంలో వీరిద్ద‌రి మ‌ధ్య కొంత కాలం స్నేహం సాగిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News