ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరో పెళ్ళికి సిద్ధం అయ్యారా?. అది కూడా సోమవారం నాడే ఈ పెళ్లి జరిగిందా?. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా లో కూడా ఇప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నాగ చైత్యన తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే వీళ్ళిద్దరూ అమెరికా తో పాటు దుబాయ్ తదితర దేశాల్లో కలిసి తిరిగిన ఫోటో లను ఏ మాత్రం దాయకుండా ఓపెన్ గానే షేర్ చేసుకుంటూ వస్తున్నారు. సడన్ గా సమంత ఇప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇతర హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరీయెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది.
అడపాదడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ లో వీళ్లిద్దరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటికి మరింత ఊతం ఇచ్చింది మాత్రం రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ పెట్టిన ఓ పోస్ట్ అనే చెప్పొచ్చు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లే వ్యవహరిస్తారు అంటూ ఆమె ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వీళ్ళ పెళ్లి వార్తను ఆమె కన్ ఫర్మ్ చేసినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. జాతీయ మీడియా అయితే సోమవారం ఉదయమే వీళ్ళ పెళ్లి లింగ భైరవి టెంపుల్ లో జరిగినట్లు వెల్లడించింది. ఈ పెళ్ళికి కేవలం 30 మంది మాత్రమే హాజరు అయినట్లు చెపుతున్నారు.
కొద్ది నెలల క్రితం సమంత నిర్మాతగా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయింది. సమంత ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత ఇందులో జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సామ్‌కు వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి హిట్ అందిపుచ్చుకోవడం ఆమెకి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా ఐటెం సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ గా మారిందో అందరికి తెలిసిందే.