భారీ అంచనాల మధ్య విడుదల అయి ..బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసిన శాకుంతలం సినిమా ఓటిటి లోకి వచ్చేసింది ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దేవ్ మోహన్ నటించిన విషయం తెలిసిందే. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించి సందడి చేశారు.
ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు వీక్షించవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా ను తెరకెక్కించినా టాలీవుడ్ లోనే దీనికి ఏ మాత్రం ఆదరణ దక్కలేదు. తెలుగు, హిందీ తో పాటు మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఓ టిటి లో చూడవచ్చు అని నిర్మాణ సంస్థ వెల్లడించింది.