
గుట్కా వ్యాపారి, సినీ నటుడు సచిన్ జోషి తన అరెస్ట్ వార్తలను ఖండించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారు తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గుట్కా అక్రమ రవాణా కేసులో సచిన్‌ను అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఓ గుట్కా కేసు విచారణలో సచిన్ పేరు రావడంతో... హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని వార్తలు వెలువడ్డాయి. ముంబయ్ లో అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సచిన్ తన ట్విట్టర్ ద్వారా ఆ వార్తలను తోసిపుచ్చారు.S