Full Viewపుష్ప సినిమాపై పుల్ పాజిటివ్ బజ్ వస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూచేయని రోల్ చేస్తుండటం కూడా దీనికి కారణం. ఊర మాస్ లుక్..ఊర మాస్ డ్యాన్స్ లు..పాటలు ఆసక్తిని రేకిస్తున్నాయి. గురువారం నాడు సామి పుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట అదరగొట్టింది. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక....పులివచ్చి కొరుకుద్ది పీక పాటతోపాటు శ్రీవల్లి సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు సామి నా సామి సాంగ్ కూడా అదరగొడుతోంది. అల్లు అర్జున్ కు జోడీగా ఇందులో రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మించింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సామి సామి సాంగులో అల్లు అర్జున్, రష్మిక మందనలు కూడా డిఫరెంట్ లుక్ లో కన్పించారు.