Full Viewప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమా తుది షెడ్యూల్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వెళుతున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇదే సినిమాకు సంబంధించిన పాట వింటూ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ హ్యాండిల్ ను ఎన్టీఆర్ కు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఎన్టీఆర్ ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్ అభిమానులకు అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా సందడి చేయనున్నారు. ఈ సినిమాను దసరాకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.