Full Viewభారీ యాక్షన్ సన్నివేశాలు.. రాజమౌళి సినిమాల్లో ఉండే భారీతనంతో రౌద్రం..రుధిరం..రణం (ఆర్ఆర్ఆర్) ట్రైలర్ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. యువ కొమరం భీమ్ గా ఎన్టీఆర్, యువ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎత్తున హైప్ క్రియేట్ అయింది. బాహుబలి రెండు భాగాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఇదే కావటం, ఇందులో ఇద్దరూ టాప్ హీరోలు ఉండటంతో దీనిపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
ఈ పాన్ ఇండియా సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉంది. బాలీవుడ్ నుంచి అలియాభట్ తోపాటు అజయ్ దేవ్ గన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నటి ఓలివియో మోరిస్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా సందడి చేయనున్నారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో ట్రైలర్ సందడి ప్రారంభం అయింది. సోషల్ మీడియాలో మాత్రం ఉదయం పదకొండు గంటలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టం అవుతోంది.