ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం దుబాయ్ లో జరగనుంది. దుబాయ్ లో జరుగుతున్న ఇండియా ఎక్స్ పో 2020లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బయలుదేరి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుబాయ్ లో కార్యక్రమం ముగిసిన వెంటనే భారత్ లోనూ పలు రాష్ట్రాల్లో వరస పెట్టి ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేశారు.