అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం నాడు టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భారతీయ క్రీడా బృందానికి ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేకమైన చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో పైన ఒలింపిక్స్ లోగోతోపాటు కింద అల్లూరి సీతారామరాజు పాత్రలో ఉన్న రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ చిత్రాలు కూడా బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు.
దేశమందరితోపాటు తాము కూడా భారత బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల దగ్గర నుంచి విశేష ఆదరణ లభించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా దసరా సందర్బంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.