ఆర్ఆర్ఆర్ విడుదల అక్టోబర్ 13న

Update: 2021-01-25 08:44 GMT

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ వచ్చేసింది. ముందు ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్యాన్స్ ను కుషీ చేసే ఈ వార్తను వెల్లడించింది. రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేస్తుండగా..ఎన్టీఆర్ బండిపై ఉన్న ఫోటోను విడుదల చేసింది. నీరు..నిప్పు కలసి ఎవరూ ఆపలేని శక్తితో వస్తున్నారు అంటూ పేర్కొంది చిత్ర యూనిట్. 2021 అక్టోబర్ 13న సినిమా థియేటర్లలో చూసేందుకు రెడీగా ఉండమంటూ ప్రేక్షకులను కోరింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషిస్తుండగా...ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ ఖరారు కావటంతో చిత్ర యూనిట్ ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా కారణంగా ఆలశ్యం అయిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావటంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇక పండగే.

Tags:    

Similar News