ఆర్ఆర్ఆర్ టీమ్ స్పీడ్ పెంచింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు రంగం సిద్ధం కావటంతో నిత్యం ఏదో ఒక రకంగా సినిమాను వార్తల్లో ఉంచేలా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ప్రమోషన్ షెడ్యూల్ ను వీడియో రూపంలో విడుదల చేసింది. దుబాయ్ లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ అంగరంగవైభవంగా నిర్వహించునున్నారు. అక్కడ నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో చిత్ర టీమ్ పర్యటనలు చేయనుంది. అందులో భాగంగా ఆరు రోజుల వ్యవధిలో తొమ్మిది ప్రధాన నగరాల్లోని సినీ అభిమానులను 'ఆర్ఆర్ఆర్' బృందం కలవబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ రూట్ మ్యాప్‌ను రాజమౌళి విడుదల చేశారు.
ప్రచారం నిర్వహించే ప్రాంతాల వివరాలు:
18–03–2022: దుబాయ్
19–03–2022: బెంగళూరు
20–03–2022: బరోడా, ఢిల్లీ
21–03–2022: అమృత్సర్, జైపుర్
22–03–2022: కోల్‌కతా, వారణాసి
23–03–2022: హైదరాబాద్.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించిన చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏపీ సర్కారు కూడా తాజాగా ఈ సినిమాకు ప్రత్యేకంగా రే్ట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.