Full Viewఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాటు నాటు సాంగ్ ప్రొమో వచ్చేసింది. నా పాట సూడు..నా పాట సూడు..నాటు నాటు అంటూ సాగే పాటను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ఒక రోజు ముందు పాట ప్రొమోను విడుదల చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎత్తున హైప్ క్రియేట్ అయింది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో సహజంగానే దీనిపై అందరి కళ్లు ఉంటాయి. మరి జనవరి 7న విడుదల అయ్యే ఈ సినిమా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కు డీవీవీ దానయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.